తెలంగాణ బిల్.. 65 పేజీలు, 13 షెడ్యూళ్ళు

 

telangana bill, ap assembly, telangana full bill, telangana bill information

 

 

65 ఏజీలు, 13 షెడ్యూళ్లతో కూడిన ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు సభ ఈ ఉదయం ప్రారంభం కాగనే విపక్ష సభ్యుల నిరసనతో రెండు సార్లు వాయిదా పడింది.

షెడ్యూల్ వివరాలు...

1.మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు

2. రెండో షెడ్యూల్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌విభజన వివరాలు

3. మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు

4. నాల్గో షెడ్యూల్‌లో మండలి సభ్యుల విభజన వివరాలు

5. ఐదో షెడ్యూల్‌లో తెలంగాణలోని దళిత వర్గాల వివరాలు

6. ఆరో షెడ్యూల్‌లో తెలంగాణలోని గిరిజన వర్గాల వివరాలు

7. ఏడో షెడ్యూల్‌లో నిధులు,

8వ షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు

9వ షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు

10వ షెడ్యూల్‌లో రాష్ట్రస్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు

11వ షెడ్యూల్‌లో నదీ జలాల నిర్వహణ బోర్డుల విధివిధానాలు

12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు

13వ షెడ్యూల్‌లో విద్య, మౌలిక సదుపాయాల వివరాలు