TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేరాల అడ్డా.. తెలంగాణ గడ్డ..! అధ్వానంగా శాంతి బద్రతలు

Published on: Sat Jun 4, 2022 3:59PM

బంగారు తెలంగాణ సాకారం చేస్తున్నామని ప్రభుత్వం ఒక వైపు గప్పాలు కొట్టుకుంటుంటే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. టీఆర్ఎస్ మూడేళ్ల పాలనలో నేరాల తెలంగాణ సాకారం దిశగా సాగుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి రాజకీయాలే శ్వాసగా మారిపోయిన పరిస్థితుల్లో  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ‘పెద్దల’ సేవలో తరించడమే పరమావధిగా పోలీసుల తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శాంతి భద్రతల విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని గప్పాలు కొట్టుకునే ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని కన్వీనియెంట్ గా విస్మరిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడా నింబంధనలకు మన్నన లేని పరిస్థితి నెలకొని ఉంది. మహిళలకు భద్రత గాలిలో దీపంగా మారింది. నేరాలలో ‘పెద్దల’సంబంధీకుల పాత్ర ఉంటే.. ఇక ఆ కేసు దర్యాప్తు గోదాట్లో కలిసినట్లేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణ సాకారం అటుంచి నేరాల తెలంగాణ సాకారం అవుతున్న పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్ వినియోగం, పబ్బుల్లో  మైనర్లకు ప్రవేశం వెరసి తెలంగాణలో పబ్ కల్చర్ వికృత రూపం దాలుస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికపై మైనర్ బాలురు సామూహిత అత్యాచారానికి పల్పడిన సంఘటన కలకలం రేపింది.

ఈ ఘటనలో పెద్దల తనయుల ప్రమేయం ఉందనీ, దర్యాప్తు సవ్య రీతిలో జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ నమ్మించి కిడ్నాప్ చేసి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు సైతం మైనర్లు కావడం గమనార్హం. నేరం గురించి ఒకింత సేపు పక్కన పెడితే అసలు పబ్ లోకి మైనర్ల ప్రవేశానికి ఎలా అనుమతించారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. పబ్ లకు అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వెనుక కూడా ప్రభుత్వ ప్రమేయం ఉందని అంటున్నారు.

అంటే టీఆర్ఎస్ భజన పరులకు అడ్డగోలుగా పబ్ లకు అనుమతులిచ్చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి పబ్ లలో నిబంధనలకు నిలువునా  పాతరేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పబ్ లలో లేట్ నైట్ పార్టీలు, ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తినా సరైన దిశగా విచారణ జరగడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ జరగడం లేదు.  తాజాగా మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం సంఘటనే తీసుకుంటే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర హోంమంత్రి మనవడు, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు ఉన్నందునే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక వైపు విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగానే ఈ కేసులో హోంమంత్రి మనవడి ప్రమేయం లేదంటూ పోలీసులు ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చేయడం, సరిగ్గా అదే సమయంలో హోంమంత్రి మనవడు తనకు ఈ అత్యాచారం సంఘటనతో సంబంధం లేదంటూ ప్రకటన చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

పోలీసుల క్లీన్ చిట్ కు ముందు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సామూహిక అత్యాచారం ఘటనలో ఎంతటి వారున్నా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. వీటన్నిటినీ ఒక వరుస క్రమంలో నిశితంగా పరిశీలిస్తే పలు అనుమానాలు తలెత్తుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంఘటన జరిగిన రోజుల తరువాత కానీ  పోలీసులు ఈ సంఘటనపై స్పందించకపోవడం, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు తరువాత కూడా చురుకుగా కదిలి అనుమానితుల వేట ప్రారంభించకపోవడంతో మైనర్ బాలిక అత్యాచారం చేసులో ‘పెద్ద’ల పిల్లలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేశారు. అసలు యువత పెడమార్గం పట్టడానికి, నేరాల దారిలో వెళ్లడానికి కారణం హైదరాబాద్ నగరం మదకద్రవ్యాలకు కేంద్రంగా మారడం, పబ్ సంస్కృతి వికృత రూపం దాలుస్తున్నా ఏలిన వారి ఒత్తడికి లొంగి పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించడమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు తోటకూర నాడే మందలించి ఉంటే అన్నట్లుగా సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం కేసును లాజికల్ ఎండ్ కు తీసుకు వెళ్లి ఉంటే ఈ  పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపుగా కొలిక్కి వస్తున్న కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి సినీ జనులకు క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రభుత్వం తహతహలాడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే  నగరంలోని ఫుడింగ్ పబ్ లో డ్రగ్స్ కలకలం రేపినప్పుడే ప్రభుత్వంక నిష్పాక్షక , పారదర్శక దర్యాప్తు జరిపి ఉంటే కొంతలో కొంతనా మాదక ద్రవ్యాల నిరోధంతో పాటు సంబంధిత నేరాలు కూడా అదుపులోనికి వచ్చే వనీ, కానీ రెండు సందర్భాలలోనూ కూడా ‘ ప్రభుత్వ పెద్దల’ జోక్యం అందుకు అడ్డుపడిందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ రెండు సందర్భాలలోనూ కూడా డ్రగ్స్ కేసను సీబీఐ విచారణకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ‘అస్మదీయుల’ను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందనీ, అంతే కానీ మాదకద్రవ్యాల నియంత్రణను పట్టిచుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో నేర సంస్కృతి వెర్రితలలు వేస్తున్నదన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం, మాదక ద్రవ్యాలను అరికట్టంలో ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోందని అంటున్నారు.  

 ఇక తాజా ఘటనలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో  ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని తేల్చిన పోలీసులు ఈఘటనపై విపక్షాలు సహా అన్నివర్గాల నుంచీ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో నలుగురిని అరెస్టు చేశారు. బిగ్ షాట్ల విషయంలో మాత్రం అరెస్టుకు ముందు వెనుకలాడుతున్నారు. పోలీస్ బాస్ హోంమంత్రి మనవడికి ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇందుకు సీసీ ఫుటేజ్ లను ఆధారంగా చూపుతున్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని ఇంకా అరెస్టు చేయలేదని చెబుతున్నారు.