మోడీ నా కాళ్లు విరగొట్టినంత పని చేశారు...
Published on: Wed Mar 15, 2017 5:46PM
.jpg)
ప్రధాని నరేంద్ర మోడీ.. కేసీఆర్ కాళ్లను విరగ్గొట్టినంత పని చేశారంట. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే మోడీకి చెప్పారంట. ఇంతకీ ఆ మ్యాటరేంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శాసన మండలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన... పెద్ద నోట్ల రద్దు వల్ల మోటారు వాహనాల పన్నుల రీత్యా కొంత ఆదాయం తగ్గింది తప్ప.. తెలంగాణ రాష్ట్రానికి మరీ పెద్ద ఎక్కువ నష్టం ఏమీ జరగలేదని అన్నారు. అంతేకాదు ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత ఆయనకు మొదట ఫోన్ చేసింది తానేనని.. పెద్ద నోట్లను రద్దు చేసి తన కాళ్లు విరగ్గొట్టినంత పనిచేశారని చెప్పానని.. అందుకు ఆయన ఏం జరిగింది అని అడుగగా.. రాష్ట్రంలో తాము మొత్తం 31 జిల్లాలను ఏర్పాటుచేసుకున్నామని, రియల్ ఎస్టేట్ బూమ్ బ్రహ్మాండంగా ఉండి ఆదాయం ఊపందుకుందని, సరిగ్గా ఇలాంటి సమయంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, కొత్త నోట్ల అందుబాటు కూడా తక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందని వివరించానని చెప్పారు.


