బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. కాంగ్రెస్ వాకౌట్..
Published on: Fri Mar 24, 2017 11:00AM

ఒక పక్క ఏపీ అసెంబ్లీలో ప్రతపక్ష నేతలు సభ జరగకుండా రచ్చ చేస్తున్నసంగతి తెలిసిందే. మరోపక్క పక్క రాష్ట్రమైన తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మత పరమైన రిజర్వేషన్ల అంశం ఈనాటి సభను కుదిపేసింది. దీంతో ఆందోళన బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనలు చేపట్టగా.. వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా, ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశ ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ధోరణి మంచిది కాదని అన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలే కాని, సస్పెండ్ చేయకూడదని చెప్పారు.


