జగన్ మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడండి..
Published on: Wed Mar 22, 2017 1:00PM
.jpg)
అసెంబ్లీల్లో అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదాలు జరగడం కామన్. అధికార పక్షాన్ని మాట్లాడనివ్వకుండా ప్రతిపక్ష నేతలు ఏదో ఒకరకంగా ఆందోళనలు చేస్తూనే ఉంటారు ఈనేపథ్యంలోనే తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఓ ఉదాహరణ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదంటూ అధికారపక్షంపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. విపక్షాల వ్యాఖ్యలకు స్పందించిన హరీశ్ రావు మాట్లాడుతూ.. పద్దులపై చర్చ సందర్భంగా 6.35 గంటలు టీఆర్ఎస్ మాట్లాడితే, 7.30 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని చెప్పారు. ప్రతిపక్షం మీద ఉన్న గౌరవంతోనే తాము విపక్ష సభ్యులకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చామని అన్నారు. అంతేకాదు..ఏపీ శాసనసభలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూడాలని... ప్రతిపక్ష నేత జగన్ మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడాలని సూచించారు.


