గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాల అసంతృప్తి...
Published on: Fri Mar 10, 2017 10:41AM
.jpg)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగం ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీ సభ్యులు మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ..ప్రసంగంలో ఉన్నవన్నీ అవాస్తవాలే అని..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు గవర్నర్ ప్రసంగంలో లేనే లేవని వారు విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు ఊసే లేదని, దళితులకు మూడెకరాలు భూమి కేటాయింపు విషయం మర్చిపోయారని అన్నారు. అంతేకాదు టీడీపీ సభ్యులు కూడా గవర్నర్ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


