TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో అంశాలు..

Published on: Fri Mar 10, 2017 10:39AM

 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ...కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.. రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. రాష్ట్రం ఏర్పడిన 9 నెలల కాలంలోనే ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా చేశామని వెల్లడించారు. ఇంకా గవర్నర్ ప్రసంగంలోని అంశాలు..

 

* ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంద
* పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా రూ. 54వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* 13.7 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని
* మిషన్ బగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీటిని అందిస్తాం
* మిషన్ కాకతీయ ఫేజ్ 1, 2 కింద కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
* పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 5900 ఉద్యోగాలను, విద్యుత్ శాఖలో 2681, ఆర్టీసీలో 3950, పోలీస్ శాఖలో 10,422 ఉద్యోగాలు, సింగరేణిలో 4500 ఉద్యోగాలను భర్తీ చేశాం
* శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళల నిరోధానికి షీ టీమ్స్ ను ఏర్పాటు చేశాం.
* పోలీసులకు కొత్తగా 4వేల వాహనాలను కేటాయించాం