తెలంగాణ ఇక సింగపూరే.. కేసీఆర్
Published on: Sat Aug 23, 2014 11:55AM
.jpg)
ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో వున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఐఎం పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నవ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనతోపాటు, పాలనలో పారదర్శకత వుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సింగపూర్‌లా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు భారతదేశంలో ప్రవేశించడానికి తెలంగాణ రాష్ట్రం ముఖద్వారంలా వుంటుందని, ఆటోమేటిక్ అప్రూవల్ సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని కేసీఆర్ వివరించారు.


