మళ్ళీ అఖిలపక్షాన్ని పిలవాలి: బొత్స..!
Published on: Tue Oct 8, 2013 3:51PM
.jpg)
రాష్ట్ర విభజన విషయమై సీమాన్ధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపధ్యలోను,బొత్స స్వస్థల మైన విజయనగరంలో బొత్స ఆస్తులపై జరుగుతున్న దాడుల నేపధ్యంలోను,బొత్స ఎ.పి ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజలలో నెలకొన్న ఆందోళనల విషయమై మళ్ళి అధిష్టానం అఖిలపక్షాన్ని పిలవాలని లేఖరయనున్నట్లు తెలియజేశారు. అంతే కాదు తాను వెనుకబడిన ప్రాంతం నుండి,వెనుకబడిన సామాజికవర్గం నుండి వచ్చినవాడినని కూడా వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం ఇంతకు ముందు అఖిలపక్ష సమావేశంలో కాని,సి డబ్ల్యు.సి సమావేశంలో కానీ బొత్స తన వంతు కృషిగా తాను ఏమిచేసారో ప్రజలకు తెలియచేయాలని భావిస్తున్నారు.


