అలాంటి వారి గెలుపు కోసం ప్రచారం చేస్తా కోదండరాం
Published on: Wed Dec 21, 2011 8:11AM
హైద
రాబాద్: తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వారందరికీ జెఏసి మద్దతు ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఉప ఎన్నికలలో తెలంగాణపై స్పష్టత ఇచ్చిన వారికి తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. అలాంటి వారి గెలుపు కోసం ప్రచారం చేస్తామన్నారు. స్పష్టత ఇవ్వని నేతలకు మద్దతు పలికే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వారిని ప్రజలు గ్రామాల్లోకి వస్తే నిలదీస్తారని హెచ్చరించారు.
కాగా, ఈ నెల 23వ తేదిన తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గిన రోజు కాబట్టి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. 23ను తెలంగాణ ప్రజలంతా విద్రోహదినంగా పాటించాలని టిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. విద్రోహ దినం రోజున గ్రామాల్లో ర్యాలీలు, నిరసనలతో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని తమ శ్రేణులకు పిలుపు నిచ్చింది. ఈ సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


