టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
Published on: Sun Mar 5, 2017 2:40PM
.jpg)
తెలంగాణ శాసనసమండలికి వివిధ కోటాల్లో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి తన అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు:
* గంగాధర్ గౌడ్
* ఎలిమినేటి కృష్ణారెడ్డి
* మైనంపల్లి హనుమంతరావు
గవర్నర్ కోటా అభ్యర్థులు:
* డి.రాజేశ్వర్
* ఫారూక్ హుస్సేన్
అయితే స్థానిక సంస్థల కోటా కింద ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్ఎస్ మద్ధతు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.


