టీ-నేతల డ్రామాని కొనసాగిస్తున్న సీమంధ్ర నేతలు

 

ఇంతకు మునుపు టీ-కాంగ్రెస్ నేతలు ప్రజల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి అధిష్టానాన్నివిమర్శిస్తూ, తెలంగాణా ఈయకపోతే పార్టీ నామరూపాలు లేకుండా మాయమయిమ పోతుందని శాపనార్ధాలు పెడుతూ, పార్టీని వీడిపోతామని 'చాయ్ బిస్కట్ సమావేశాలు' పెట్టుకొంటూ, పార్టీకి నెలకో కొత్త డెడ్-లయిన్లు పెడుతూ రోజులు దోర్లించుకొంటూ పోయి చివరికి ఎలాగయితేనేమి తమ పదవులు కాపాడు కోగలిగారు. వారి అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తెలంగాణా కూడా ఇచ్చేస్తోంది. ఇప్పుడు ఆ డ్రామా కొనసాగించడం సీమంధ్ర కాంగ్రెస్ నేతల వంతయింది. ఈ డ్రామాలో సన్నివేశాలు అన్నీ తెలంగాణా నేతల డ్రామాలోవే, కాకపోతే పాత్రదారులు మారారు.

 

1.రాష్ట్ర విభజన చేస్తే (తెలంగాణా ఈయకపోతే) పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది.

 

2.రాష్ట్ర విభజన చేయడం (తెలంగాణా ఈయకపోవడం) వలన అధిష్టానం చాలా తప్పు చేస్తోంది.

 

3.టీ-నోట్ పై అడుగు ముందుకు వేస్తే, (తెలంగాణాపై జాప్యం చేస్తే) శాసన సభలో టీ- బిల్లు పెడితే, ( పెట్టకపోతే) పార్లమెంటులో టీ-బిల్లు పెడితే (పెట్టకపోతే), న్యాయపోరాటంలో ఓడిపోతే, రాష్ట్ర విభజన జరిగిపోతే (తెలంగాణా ఏర్పాటు చేయక పోతే) రాజీనామాలు చేసేస్తాము. డెడ్-లయిన్లన్నమాట!

 

4. తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ సమావేశాలలో చాయ్, కారా బిస్కట్లు, సమోసాలు లైక్ చేస్తే, సీమాంద్రా కాంగ్రెస్ నేతల సమావేశాలలో కాఫీ, బ్రిటానియా బిస్కట్లు ఉండవచ్చును. కానీ రెండు ప్రాంతాల నేతలు ఒకే డ్రామాని కొనసాగిస్తున్నందున ఇరువురూ బిస్లిరీ నీళ్ళే తాగుతారు.