తెలంగాణపై తొందరపడ్డాం

 

తెలంగాణ విభజన ప్రకటన తరువాత వెళ్లువెత్తిన నిరసనలతో కేంద్ర సందిగ్దంలో పడింది. మొదట సీమాంద్రలో జరుగుతున్న నిరసనలను లైట్‌ తీసుకున్న కేంద్ర 50 రోజుల తరువాత కూడా నిరసనలు కొనసాగుతుండటంతో కేంద్ర ఇప్పుడు పునరాలోచనలో పడింది. విభజన నిర్ణయంపై తొందర పడ్డామని అంగీకరించిన అహ్మద్‌ పటేల్‌. సీమాంద్రలో పరిస్థితి ఇలా మారుతుందని అంచనాలవేయలేకపోయామన్నారు.

బుధవారం సోనిమా గాందీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో సమావేశం అయిన సీమాంద్ర ప్రాంత ఎంపిలు, కేంద్ర మంత్రులు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను అహ్మద్‌పటేల్‌కు వివరించారు. అయితే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం పై ఆలోచిస్తున్నామన్న ఆయన ఇప్పట్లో ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోయినా వెనక్కు కూడా వెళ్లలేమని తేల్చి చెప్పారు.

ఇప్పట్లో రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని, ఆంటోని కమిటీ నివేదిక వచ్చిన తరువాత తదుపరి కార్యచరణ ఉంటుందిని తేల్చి చెప్పారు. తరువాత వీరప్పమొయిలితో కూడా భేటి అయిన సీమాంద్ర నాయకులకు ఇదే హామి లభించింది.