సీమాంద్ర నాయ‌కుల రాజీనామా..?

 
తెలంగాణ,సీమాంద్ర ప్రాంతాల్లో ఆందోళ‌నల సంగ‌తులు ఎలా ఉన్నా.. కేంద్ర మాత్రం విభ‌జ‌న దిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే హోం శాఖ నోట్ కూడా రెడీ చేసిన కేంద్ర త‌దుప‌రి చ‌ర్య‌లకు కూడారెడీ అవుతుంది. ఆంటోని క‌మిటీ కూడా త‌న నివేదిక‌ను నేడు కేంద్ర ముందు ఉంచ‌నుంది. తెలంగాణ ప్ర‌క‌ట‌న త‌రువాత వ‌చ్చిన భావోద్వేగాల నేప‌ధ్యంలో కేంద్రం ఈ క‌మిటీని ప్ర‌క‌టించింది.

ఈ నేప‌ధ్యంలో నిర్ణ‌యం తెలంగాణ‌కు అనుకూలంగా వ‌స్తే సీమాంద్ర ప్ర‌జా ప్ర‌తినిధులు మూకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్దం అవుతున్నారు. సీమాంద్రుల‌తో పాటు తెలంగాణ ప్రాంత నాయ‌కులు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించిన ఆంటోని క‌మిటీ దాదాపుగా తెలంగాణ‌కు అనుకూలంగా నివేధిక ఇచ్చే అవ‌కాశం ఉంద‌టున్నారు విశ్లేష‌కులు.

కేంద్ర నిర్ణ‌యంతో పాటు హోం శాఖ నోట్ తుదిమెరుగులు కూడా ఆంటోని క‌మిటీ ఆదారంగా త‌యారు చేయ‌నున్న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రజాప్ర‌తినిధులు త‌మ ఆఖ‌రి అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు.