కేబినేట్ నోట్ రెడీ.. అమ్మ ఆమోద‌మే త‌రువాయి..

 

స‌మైక్యాంద్ర కోసం ఉద్యమం ఉదృతంగా కొన‌సాగుతున్న కేంద్ర మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుపై ఓ అభిప్రాయానికి వ‌చ్చిన అధిష్టానం ఏర్పాటు ప్రక్రియ‌లోని రెండో ద‌శ ను కూడ పూర్తి చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంభందించిన క్యాబినేట్ నోట్ ను కేంద్ర హోం శాఖ సిద్దం చేసింది.

అయితే ఈ నోట్‌కు సోనియా ఆమోదం ప‌డిన వెంట‌నే నోట్‌ను న్యాయశాఖ‌కు పంప‌నున్నారు. ఈ మేర‌కు అధికారిక ప్రక‌ట‌న ఏది వెలువ‌డ‌క పోయినా నేష‌నల్ మీడియాలో మాత్రం నోట్ రెడీ అయిన‌ట్టుగా క‌థ‌నాలు ప్రసారం అవుతున్నాయి. కేంద్రం హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలోని బృందం రాజ్యాంగా విధివిదానాల ప్రకారం క్యాబినేట్ నోట్ సిద్దం చేశారు. ఇక దీనికి రాజకీయ ఆమోదం ప‌డ‌ట‌మే త‌రువాయి.

అయితే ప్రస్థుతం వైద్య చికిత్స కోసం అమెరికా ప‌ర్యట‌న‌లో  ఉన్న సోనియా గాంధికి భార‌త్‌కు రాగానే ఆమె ఆమోదం కోసం నోట్‌ను పంప‌నున్నారు. అయితే సోనియా ఇండియాకు రావాడానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌టున్నారు కేంద్ర వ‌ర్గాలు. ఆమె రాగానే నోట్‌కు ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంద‌ని హోం శాఖ అధికారులు తెలిపారు. సోనియా ఆమోదం త‌రువాత  నోట్‌ను న్యాయ శాఖ ప‌రిశీల‌న‌కు పంపిస్తారు.