తెలంగాణలో ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

 

తెలంగాణలో జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రల్లో పంపీణి చేయాలని  ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్ల పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. ఆందోళన అవసరం లేదు’’ అని సీఎం అన్నారు.

సన్నం బియ్య ఇస్తుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం తెలిపారు. జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం  ఆదేశించారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్‌ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.

‘‘రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయి. ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్‌ ఉందో బయట నోటీస్‌ బోర్డు పెట్టాలి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించామని తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu