TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ !

Published on: Thu Apr 17, 2025 3:08PM

 

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్. త్వరలో మళ్లీ లిక్కర్ ధరలను పెంచాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు  తెలుస్తోంది ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం రేటులను పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. చీప్ లిక్కర్ మినహాయించి.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. బాటిళ్లపై కనీసం రూ.50 పెరిగే ఛాన్స్ ఉంది.అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

వెయ్యి రూపాయల బాటలు ధర 1100 గా ఉండనుంది. చీప్ లిక్కర్ పైన పెంచకుండా బ్రాండెడ్ మందుల పైనే పెంచాలని యెచ్చిస్తోంది. దింతో మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒకవేళ ధరలు పెరిగితే రెండువేల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి సర్కార్ కు రానుంది. త్వరలో చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు టాక్