అడ్డుకునేందుకే రాజ్యసభలో గందరగోళం
Published on: Sun Dec 18, 2011 8:24AM
హై
దరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేవకర్ ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ రాజ్యసభలో గందరగోళం సృష్టించిందని మండిపడ్డారు. శుక్రవారం రాజ్యసభలో తెలంగాణపై ప్రవేశపెట్టిన ప్రవైట్ బిల్లుపై చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆందోళనను వినిపించేందుకు తనకు అవకాశం ఇవ్వనందుకు నిరాశ చెందామన్నారు. రాజ్యాంగ పరిధిలో ప్రత్యేక శాసనసభ, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థతో ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని తన తీర్మానంలో ప్రభుత్వాన్ని కోరాలనుకొన్నానని, కానీ తనకా అవకాశం లభించలేదని జవదేకర్ అన్నారు.


