TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జేపీకి ఎదురైన తెలంగాణవాదుల నిరసన

Published on: Fri Dec 16, 2011 1:33PM

ఖమ్మం: లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణకు తెలంగాణవాదుల నుంచి నిరసన ఎదురైంది. అవినీతి వ్యతిరేక పోరాట సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఖమ్మం వచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా జేపీ వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు వేదిక పైకి వెళ్తున్న ఆయన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు జీవితాల్ని బలి చేసుకుంటుంటే అవినీతిపై పోరాటమంటూ జేపీ తెలంగాణలో పర్యటించడం దారుణమని టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో జేపీ కూడా ఒకింత కలవరపడ్డారు. తెలంగాణ వాదుల్ని అరెస్టు చేసిన తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.