TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్యేక తెలంగాణా ఇక లేనట్లేనా ?

Published on: Sat Jul 28, 2012 2:07PM

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇక లేనట్లే. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకూ ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ముందుంచుతామన్న కేంద్రం ఇక ఒకవైఖరి ప్రకటించేయాలని నిశ్చయించుకుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను భౌగోళికంగా విడదీయలేమని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి నివేదించింది. నదులు, నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా అతిచిన్నరాష్ట్రంగా తెలంగాణా ఏర్పడితే నిధుల కొరతే కాకుండా ఎన్నో కొత్తసమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ఈ ప్రత్యేకతెలంగాణా గురించి అథ్యనం చేసిన జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ తన ఆరోసిఫార్సులో యథాతథస్థితి కొనసాగింపు అంశాన్నే హోంశాఖ బలపరిచింది.


తెలంగాణా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆర్థికభద్రత, సామాజికరక్షణ, చట్టపరమైన చర్యలు ద్వారా పరిష్కారం వెదకవచ్చని స్పష్టం చేసింది. మరో రెండేళ్లలో రాష్ట్రంలో తెలంగాణా అభివృద్థిపై ఒక స్పష్టతతో కూడిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడిరది. ఈ నివేదికను ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోపు బహిరంగపరచాలని కూడా హోంశాఖ భావిస్తోంది. అయితే నివేదిక ఇచ్చే అథికారం హోంశాఖకు లేదని, మొత్తం కేబినెట్‌ పరంగానే రాష్ట్రపతికి నివేదిక పంపాలని మాజీ ఎంపి, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వినోద్‌ అంటున్నారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని హోంశాఖ చర్యను ఆయన ఖండిరచారు.



ఇప్పటికే తెలంగాణా జెఎసి ప్రత్యేకరాష్ట్రం కోరుతూ ఆందోళనలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ ఆందోళనకు వెళ్లేందుకు ప్రజలు సముఖత వ్యక్తం చేయటం లేదు. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనవసరంగా ఆందోళనలకు దిగొద్దని టిఆర్‌ఎస్‌ అథినేత కెసీఆర్‌ ఇచ్చిన పిలుపు తెలంగాణావాదులను వెనక్కి తగ్గేలా చేసింది. అందువల్ల టిజెఎసికి స్పందన కొంతమేరకు తగ్గింది. అయితే విద్యార్థులు మాత్రం మొదటి నుంచి యథాప్రకారం ఆందోళనలకు సిద్ధమవుతూనే ఉన్నారు. వారు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పరిథిలో లేరు. ఎందుకంటే వారు మొదటి నుంచి ప్రతీఅంశాన్నీ నేరుగా పరిశీలించి ప్రత్యక్షచర్యలకు సిద్ధమవుతున్నారు.



ఇప్పుడు కేంద్రహోంశాఖ నిర్ణయంపై కూడా వీరి నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఒకరకంగా టిఆర్‌ఎస్‌ అదుపుతప్పిందనటానికి విద్యార్థుల పోకడే నిదర్శనంగా తీసుకోవచ్చు. ప్రత్యేకతెలంగాణా ఉండబోదన్న నిర్ణయం జైఆంథ్రా ఉద్యమంలో పాల్గొన్న వృద్ధులూ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ రెండిరటిని ప్రభుత్వం అదుపు చేయగలిగితే కేంద్రం నివేదిక రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకి అవటం వల్ల సమైక్య ఆంథ్రా వర్ధిల్లుతుంది. కేంద్రం నివేదిక పట్ల సమైక్యాంధ్ర  సులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు రాష్ట్రపతిని తన వైఖరి మార్చుకోకుండా తెలుగుజాతిని కాపాడాలని కోరుతున్నారు.