మార్పులు తథ్యం కానీ, తెలంగాణా సాధ్యమా?
Published on: Fri Jun 15, 2012 8:33AM
"ఉప ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. ఆ తరువాత తెలంగాణా ప్రకటించేస్తారు'' అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యానం ఆయన్ని అపహాస్యం పాలుజేస్తోంది. ఆయన మాటలను తెలంగాణా ప్రాంతంలోనే విశ్వసించటం లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకోండి. ఎన్నోసార్లు రిఫరెండెం, తేదీలు ప్రకటించే కేసీఆర్ తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఈసారి నూటికినూరుపాళ్ళూ నిజమని ఆయన తనప్రకటనలో ప్రతీసారి చెప్పుకోవటం, కేంద్రం తెలంగాణాకు సానుకూలంగా ఉందనటం ఇది రొటీన్ డైలాగ్ నమ్మించేలా ఉందని తెలంగాణావాదులంటున్నారు. అసలు తెలంగాణాయే రాలేదు కానీ, దాన్ని దేశంలో నెంబర్ వన్ గా ఎదిగేలా చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఇంకా చెప్పాలా! అయితే కేసీఆర్ ప్రకటనలో ఒక నిజం మాత్రం ఉంది. అదేమిటంటే ఉపఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రరాజకీయాల్లో పెనుమార్పులు మాత్రం జరగొచ్చు. తెలంగాణా సమస్య మాత్రం 2014 వరకూ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.


