TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టిఆర్ఎస్ ను అడ్డుకుంటున్న గ్రామస్తులు

Published on: Fri Mar 9, 2012 10:15AM

హైదరాబాద్: తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన టిఆర్ఎస్ ప్రస్తుత ఉప ఎన్నికల్లో కొన్నిచోట్ల ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. టిఆర్ఎస్ ప్రచార బృందాలను, కళాశాలను కొన్నిచోట్ల గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. టిఆర్ఎస్ తెంలగానా తెచ్చేది లేదు చచ్చేది లేదు గాని 6 నెలలకోకసారి ఎన్నికలను మాత్రం తెస్తుందని వారు విమర్శిస్తున్నారు. ఇటీవలి సకలజనుల సమ్మెను, తెలంగాణా ఉద్యమాన్ని మధ్యలోనే ఎందుకు విరమించాల్సి వచ్చిందని వారు ప్రచార బృందాలను ప్రశ్నిస్తున్నారు. మరి కొన్నిచోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఏకమై టిఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని పల్లెల్లోకి పాటలు పాడుకుంటూ వస్తున్న టిఆర్ఎస్ బృందాలను గ్రామస్తులు ఊరిలోకి రానీయలేదు. ఈ పరిణామాలు టిఆర్ఎస్ ఆందోళన కలిగిస్తున్నాయి.