TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు కరెంటుకోతల కష్టాలు

Published on: Thu Mar 8, 2012 10:39AM

హైదరాబాద్: తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగబోతున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులకు కొత్త సమస్య ఎదురయింది. కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ స్థానిక ప్రజలు, రైతులు కూడా కరెంటు కోతలపై వాళ్ళను నిలదీస్తున్నారు. కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోర్లనుంచి నీళ్ళు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు. పరీక్షల సమయంలో కూడా ఈ కరెంటు కోతలు ఏమిటని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వేళాపాళా లేకుండా కరెంటు తీసివేయడం ఏమిటని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు. వీరి దాడికి కాంగ్రెస్ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన షబ్బీర్ ఆలీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన ఏ గ్రామం వెళ్లినా కరెంటుకోసం ఎంతో చేశానంటున్నావు మరి కరెంటు ఎక్కడ ఉంది అని గ్రామాల్లో ఆయనను నిలదీస్తున్నారు. ఈ కరెంటు కోతలు ఉప  ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లకు కోత కోయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.