కొత్త పార్టీ పొరపాటు నిర్ణయం: గద్దర్
Published on: Sun Feb 12, 2012 10:19AM
హైద
రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం తాను పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై ప్రజా ఫ్రంట్ చైర్మన్, ప్రజా గాయకుడు గద్దర్ వెనక్కి తగ్గారు. రాష్ట్రం కోసం కొత్త పార్టీ పొరపాటు నిర్ణయమన్నారు. శనివారం సుందరయ్య కళా భవనంలో జరిగిన కార్యవర్గ భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గద్దర్ పార్టీ నిర్ణయాన్ని కార్యవర్గ సభ్యులు వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన వెనక్కి తగ్గారని సమాచారం. త్వరలో ఫ్రంట్ మహాసభను నిర్వహించనున్నారు. మాజీ మంత్రి శంకర రావు ఎమ్మార్పీఎస్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడాన్ని కార్యవర్గ భేటీ తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది.


