తెలంగాణ కేసులో బాబుకి ఊరట
Published on: Thu Feb 9, 2012 8:19AM
హైద
రాబాద్: తెలంగాణకు సంబంధించిన కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని మార్చుకోవడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది వేసిన పిటిషన్ రాజకీయ ప్రేరేపితమని తెలియజేస్తూ పోలీసులు నివేదిక ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని రంగా రెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లారు.


