తెలంగాణలో జోరుగా కిషన్‌రెడ్డి పర్యటన
Published on: Thu Jan 26, 2012 10:24AM
హైద
రాబాద్: తెలంగాణ మంత్రులు ప్రధాని పర్యటనను బహిష్కరించాలని BJP రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చేంత వరకు సెక్రటేరియట్‌కు వెళ్లమని శపథం చేసిన మంత్రులు ఇప్పుడెలా పనిచేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ పోరుబాటలో భాగంగా ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తెలంగాణలో జోరుగా పర్యటిస్తున్నారు. రెండో విడత తెలంగాణ పోరుబాటలో భాగంగా.. ఆయన మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, నర్సాపూర్, జోగిపేట, చేగుంట, తూప్రాన్, మెదక్‌లలో విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తలు, నాయకులు పోరుబాటకు అడగడుగునా స్వాగతం పలికారు. తెలంగాణ మంత్రులంతా ప్రధాని పర్యటనను బహిష్కరించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. సామర్ధ్యానికి మించి కార్యకర్తలు వేదికపైకి ఎక్కడంతో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కిషన్‌రెడ్డి మాత్రం క్షేమంగా బయటపడ్డారు. పోరుయాత్రలో భాగంగా.. కిషన్‌రెడ్డి ఇవాళ, రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.


