అలా చేయడం సీమాంధ్రుల తరం కాదు:రాములమ్మ
Published on: Mon Jan 23, 2012 8:28AM
హైద
రాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలో విభేదాలు సృష్టించడం సీమాంధ్రుల తరం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె ఆదివారం ఒక ప్రైవేట్ ఛానల్‌తో మాట్లాడుతూ... తెలంగాణ రాజకీయ జేఏసీలో విభేదాలు లేవన్నారు. తెలంగాణ జేఏసీలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, న్యూడెమొక్రసీ పార్టీలు కలిసే పని చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే తమ అంతిమ లక్ష్యమన్నారు.


