అలాగే కేసీఆర్ ఉద్యమాన్ని కూడా అమ్మేస్తారు
Published on: Sun Jan 22, 2012 4:02PM
హైద
రాబాద్: తెలంగాణ కోసం పత్రిక పెడతానంటూ నమస్తే తెలంగాణ కోసం కోట్ల రూపాయలు వసూలు చేశారనీ, కోట్లు వచ్చాక మెల్లిగా ఆ పత్రికను కాస్తా అమ్మేశారని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ ధ్వజమెత్తారు. ఏదో ఒక రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా అమ్మేసి చేతులు దులుపుకుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇటువంటి వక్రమైన పనులు చేస్తున్నా టి. జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఎందకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చంద్రబాబు నాయుడు అడ్డు అని చెప్పే కోదండరామ్, తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా బాబుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు.


