TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజాద్ తో తెలంగాణ కాంగ్రెసు నేతల గోడు

Published on: Sun Jan 22, 2012 2:08PM

హైదరాబాద్: తెలంగాణ అంశం వీలైనంత త్వరగా తేల్చాలని ఆ ప్రాంత శాసనసభ్యులు కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు ఆదివారం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవనంలో ఆజాద్‌ను తెలంగాణ కాంగ్రెసు నేతలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ అంశం త్వరలో తేల్చకుంటే తాము ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదని ఆయనకు తెలియజేశారు. తమకు ఎలాంటి ప్యాకేజీలు వద్దని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువరిస్తే చాలని చెప్పారు. ఉప ఎన్నికలకు ముందే తెలంగాణకు పరిష్కారం చూపించాలని కోరారు. అలాగే తమకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో న్యాయం చేయాలని కోరారు. వారి విజ్ఞప్తులకు ఆజాద్ సానుకూలంగా స్పందించారు. పలువురు ఎమ్మెల్సీలు కూడా తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆజాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాగా అంతకుముందు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీలో ఎమ్మెల్సీలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.