TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ అంశానికి దానితో సంబంధం లేదు

Published on: Sat Jan 21, 2012 9:00AM

హైదరాబాద్: తెలంగాణ అంశానికి రెండు రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ కమిషన్ (రెండో ఎస్సార్సీ)తో సంబంధం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ చెప్పారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ అంశం సున్నితమైందని, దీన్ని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. రషీద్ అల్వీ రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగుస్తోంది. తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం.