TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమైక్యమో,విభజనో కాంగ్రెస్ దే నిర్ణయం:బొత్స

Published on: Tue Jan 10, 2012 3:47PM

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం అసన్నమైందని,తెలంగాణపై సమైక్యమో, విభజనో కాంగ్రెసు పార్టీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.ఈ సందర్భంగా అయన  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించకుంటే కాంగ్రెస్సే నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీల బాధ్యత రాహిత్యం వల్లనే తెలంగాణ అంశం ఆలస్యమవుతుందని అయన పేర్కొన్నారు.  రాజకీయ పార్టీల రెండు కళ్ల సిద్దాంతం,మూడు కాళ్ల సిద్ధాంతం పనికిరాదని అయన అన్నారు. బాధ్యత లేని పార్టీలవల్లే తెలంగాణ సమస్య ఆలస్యమవుతుందని తెలిపారు. రైతులకు వ్యవసాయం దండగన్న చంద్రబాబు, అసలు వ్యవసాయం గురించి తెలియని జగన్‌లు రైతు యాత్రలు చేస్తున్నారని బొత్స విమర్శించారు. రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు, జగన్‌లు రైతు యాత్రలు, దీక్షలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు.