TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబు అరెస్ట్..రాళ్లు దూసుకొస్తున్నదీక్షకు జగన్

Published on: Tue Jan 10, 2012 11:22AM

హైdదరాబాద్: సమైక్యవాదులుగా ముద్రపడ్డ ఇద్దరు నేతలు నేడు తెలంగాణ ప్రాంతంలో వివిధ సమస్యలపై ఒకరు దీక్షకు దిగుతుంటే మరొకరు విద్యుత్ సౌధ వద్దకు పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి విద్యుత్ సౌధ వరకూ పాదయాత్ర మొదలుపెట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3కి రాగానే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఆయన వెంట ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులను ఎదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే ఈ పాదయాత్రను తెలంగాణా వాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు గో బ్యాక్.. సమైక్యవాది చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేతబూని రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం నాయకులను పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. చంద్రబాబు పాదయాత్రతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.

కాగా పాదయాత్ర ప్రారంభించే ముందు చంద్రబాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని చెప్పి, మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు లేవని ఆయన అన్నారు. పెరిగిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు వైఎస్ జగన్ రైతుదీక్ష కోసం నిజామాబాద్ ఆర్మూర్ చేరుకునేందుకు కాన్వాయ్‌లో వస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రోడ్డుకిరువైపులా కొంతమంది ఆందోళకారులు టైర్లను కాల్చుతూ కాన్వాయ్‌పైకి రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ జగన్ తన దీక్ష కోసం ఆర్మూర్ వైపుకు వెళుతున్నారు.