TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నాఅడ్డుకుంటాం హరీష్

Published on: Mon Jan 9, 2012 10:16AM

హైదరాబాద్:  తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా తాము అడ్డుకుంటామని , ఒక్క టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడినే కాదని, చిరంజీవి అయినా, జగన్ అయినా, సిఎం అయినా ప్రశ్నిస్తామని  టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు    అన్నారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్  తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ త్యాగాల పునాదులపై ఏర్పడిందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు తమ వైఖరిని స్పష్టం చేయలేదని సాక్ష్యాత్తు చిదంబరమే చెప్పారన్నారు.  హరీష్ టిటిడిపి ఫోరం నేతలపైనా విరుచుకు పడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా మోత్కుపల్లి, ఎర్రబెల్లిల వైఖరి ఉందన్నారు. మోత్కుపల్లి తేది నిర్ణయిస్తే కెసిఆర్ తన ఆస్తులు తెలంగాణ ప్రజలకు పంచుతారని, బాబు తన ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంపేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణకు కెసిఆర్ కుటుంబమే అడ్డైతే తాను, కెటిఆర్ తప్పుకుంటామని మీరు రాష్ట్రం తీసుకు వస్తారా అని సవాల్ చేశారు. సీమాంధ్ర ఫ్యాక్షనిస్టు నేతలను వరంగల్ టూర్‌కు ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. బాబు టిఆర్ఎస్‌పై చేసిన విమర్శలు టిటిడిపి నేతలకే వర్తిస్తాయన్నారు. తెలంగాణ కోసం మేం జైళ్లకెళ్లామని వారేం చేశారని ప్రశ్నించారు.