TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతా అధిష్టానమే..నా చేతుల్లో ఏమీ లేదన్న జానా

Published on: Sun Jan 8, 2012 1:06PM

హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు వారు  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డిని కలిశారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమకు మద్దతు ఇచ్చి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థిని నిలపవద్దని తాము జానారెడ్డిని కోరామని అయితే ఆయన మాత్రం తన చేతుల్లో ఏమీ లేదని అంతా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారని తెలిపారు.ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాత్రం హామీ ఇచ్చారన్నారు. ఉప ఎన్నికల బరిలో దిగుతున్న అమరవీరుల కుటుంబ సభ్యులను అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వారు అన్ని పార్టీల వారిని కోరారు. తెలంగాణ సాధన కోసమే తాము రాజకీయాల్లోకి వస్తున్నామని వారు చెప్పారు. తమకు ఎవరూ సహకరించినా సహకరించక పోయినా పోటీ చేస్తామన్నారు. కాగా తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక అన్ని పార్టీల నేతలను కలిసి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టకుండా తమకు మద్దతు ఇవ్వాలని అడగనున్నారని సమాచారం.