తెలంగాణ ఫై స్పందించిన బొత్స
Published on: Mon Jan 2, 2012 1:46PM
విజయ
వాడ: తెలంగాణ అంశం,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసులో విభేదాలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్నికలతో సంబంధం లేకుండా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాంగ్రెసులో రెండు వర్గాలు ఉన్నాయన్న వాదనలను ఆయన కొట్టి పారేశారు. అదంతా మీడియా సృష్టియేనన్నారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీ నాయకత్వాన్ని అంగీకరించే వారినే పార్టీలో చేర్చుకుంటామన్నారు.మైలవరం ఘటన విచారకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సిండికేట్ వ్యవహారంలో పత్రికలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాగా మద్యం సిండికేట్ వ్యవహారంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణది ప్రాధన పాత్ర అని తెలుగుదేశం పార్టీ సహా పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.


