జగన్ ప్రకటనకు స్వాగతించిన టి-నేతలు
Published on: Sat Dec 31, 2011 3:46PM
హైదరాబాద్: తెలంగాణలో
ని ఉప ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రకటనను తెరాస నాయకులు టి. రాజయ్య, ఎంపి జితేందర్ రెడ్డి విడివిడిగా స్వాగతించారు. జగన్ ప్రకటనను తెలంగాణపై వైయస్ జగన్ మరింత స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస నేత టి. రాజయ్య విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే దంచాలని, అలా చేస్తే కేసులు లేకుండా చూస్తామని వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆయన మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రబెల్లిపై సుమోటో కేసు పెట్టాలని ఆయన కోరారు.కాగా తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని జగన్ చేసిన ప్రకటనను జితేందర్ రెడ్డి స్వాగతించారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్థానికతపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించారు. కెసిఆర్ స్థానికతపై అనుమానాలు ఉంటే మొయినకుంటలోని రికార్డులు చూడాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ శాసనసభా స్థానం నుంచి ఆకస్మికంగా మరణించిన శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణి పోటీ చేస్తారని ఆయన చెప్పారు.


