TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు డైరెక్షన్లో ఆ పార్టీ తెలంగాణ నాయకులు : నాగం

Published on: Sat Dec 31, 2011 2:43PM

హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో ఆ పార్టీ తెలంగాణ నాయకులు యాక్షన్ చేస్తున్నారని తెలంగాణ నగారా నేత నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తెలుగుదేశం తన వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ముమ్మాటికి సమైక్యవాదేనని ఆయన  మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనలు అర్థరహితమని ఆయన అన్నారు. తెలంగాణపై చిదంబరం కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేయకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వం చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు. విప్‌ను ధిక్కరించినట్లు స్పష్టమైనా వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడం సరి కాదని ఆయన అన్నారు. తాను తెలంగాణ నగారాలోనే ఉన్నానని తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం తాను మరోసారి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.