TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం వైఖరి తెలుసుకుంటాం : చిదంబరం

Published on: Sat Dec 31, 2011 11:49AM

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై అఖిల పక్ష సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి హాజరై తెలుగుదేశం తన అభిప్రాయాన్ని చెబుతుందని తాను అనుకుంటున్నట్లు  కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. తెలంగాణపై తెలుగుదేశం వైఖరి తెలియదని అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం వైఖరి తెలుసుకుంటామని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసేది ఆయన చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని అంటున్నారని  మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ విషయం తన దృష్టికి రాలేదని, అఖిల పక్ష సమావేశంలో స్పష్టమైన వైఖరి చెబుతారని అనుకుంటున్నానని చిదంబరం అన్నారు.

మహిళల వస్త్రధారణపై రాష్ట్ర డిజిపి చేసిన వ్యాఖ్యలతో చిదంబరం విభేదించారు. నచ్చిన డ్రెసు వేసుకునే స్వేచ్ఛ పౌరులకు ఉందని ఆయన అన్నారు. సమయం, సందర్భం, స్థలాలను బట్టి ఎవరైనా అందుకు తగిన వస్త్రధారణ చేసుకుంటారని ఆయన చెప్పారు. స్విమ్ స్యూట్ వేసుకుని కాక్‌టైల్ పార్టీకి వెళ్లరు కదా అని ఆయన అన్నారు. టెన్నిస్ ఆడడానికి వేసుకునే డ్రెసుతో ఫుట్‌బాలో, మరో ఆటనో ఆడరని ఆయన అన్నారు.