టిఆర్ఎస్ కు తెలంగాణాలో బలం లేదన్న బాబు
Published on: Fri Dec 30, 2011 2:36PM
హైదరాబా
ద్: తెలంగాణలో మాకు ఎదురు లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి బలహీనంగానే ఉందని అయన అన్నారు. గత 2009 సాధారణ ఎన్నికల్లో మేం మద్దతిచ్చినప్పటికీ టిఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుచుకోలేక పోయిందని, దీన్ని బట్టి ఎవరు బలహీనంగా ఉన్నారో అర్థమౌతోందన్నారు. ఓట్లే కొలమానం అనుకుంటే 2009లో టిడిపి మంచి పర్సెంటేజ్ సాధించిందన్నారు. తెలంగాణలో టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు పిలిస్తే ఎవరూ ముందుకు రాలేదన్నారు.


