TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఇవ్వండి : బాపూజీ

Published on: Sun Dec 25, 2011 12:31PM

హైదరాబాద్‌ : తెలంగాణ ఇవ్వాలని  రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ ను కోరుతానని స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని ఆమెకు ఓ వినతిప్రతం ఇస్తామని ఆయన చెప్పారు. మూడు ప్రాంతాల రాజకీయ నేతలతో త్వరలోనే ఓ సద్భావన సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి శంకర్రావుపై దాడి వెనుక హోంమంత్రి పాత్ర లేకపోతే, ఆమె దాడిని ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 27న ఎల్బీనగర్‌లో జరిగే ఆత్మగౌరవ గర్జన సభలో మంత్రి శంకర్రావును సన్మానిస్తామని ఆయన తెలిపారు.