తెలంగాణ సీట్లఫై కిరణ్ వ్యూహం
Published on: Fri Dec 23, 2011 11:20AM
హైదరాబాద్: తె
లంగాణలోని ఆరు శానససభా నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో కనీసం మూడు సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ఇంకా అనర్హత వేటు పడలేదు కాబట్టి ఈ ఆరు సీట్లతో పాటు వారి సీట్లకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని కనుక తొలుత తెలంగాణలోని ఆరు సీట్లకు ఉప ఎన్నికలను ఎదుర్కోవాలనే వ్యూహంతోనే కాంగ్రెసు పనిచేస్తోందని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 26వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెసు పార్టీ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరవుతారు. జిల్లాలోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. కొల్లాపూర్, నాగర్ కర్నూలు, మహబూబ్‌నగర్ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతాయి.అన్ని స్థానాలకు పోటీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు.ఈ నెల 26వ తేదీన జరిగే సమావేశంలో టికెట్ అశిస్తున్న నాయకుల విజయావకాశాలను, సర్వేల ద్వారా అందిన సమాచారాన్ని బేరీజు వేయనున్నట్లు తెలుస్తోంది.


