నాగంకు కోదండరామ్ మద్దతు
Published on: Thu Dec 22, 2011 4:02PM
హైదరాబా
ద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశం పార్టీకి, శానససభా సభ్యత్వానికి రాజీనామా చేసిన తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు శానససభా నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో నాగంకు తాము మద్దతిస్తామనితెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ భరోసా ఇచ్చారు.ఈ విషయాన్ని మీడియా ప్రతినిధుల సమావేశంలోఆయన చెప్పారు. తెలంగాణ కోసం నాగం జనార్దన్ రెడ్డి పార్టీని వదులుకున్నారని, పదవికి రాజీనామా చేశారని, అందువల్ల తాము మద్దతిస్తామని ఆయన వివరించారు. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన వారందరికీ తాము ఉప ఎన్నికల్లో మద్దతిస్తామని ఆయన చెప్పారు.
రేపు తెలంగాణ నమ్మకద్రోహ దినం పాటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ర్యాలీలో తెలంగాణవాదులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నాగం జనార్దన్ రెడ్డికి కోదండరామ్ మద్దతు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నాగర్‌కర్నూలు శానససభా నియోజకవర్గంలో ఆయనకు మద్దతునిస్తూ తన అభ్యర్థిని పోటీకి దించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. కాగా, మహబూబ్‌నగర్ స్థానానికి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూడాలని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్ని పార్టీల నాయకులను కోరారు.


