TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణపై జితేంద్ర సింగ్ వాఖ్యలు

Published on: Wed Dec 21, 2011 4:13PM

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సంబంధిత అశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని,తుది నిర్ణయం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత ఏకాభిప్రాయం అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. రాజ్యసభకు బుధవారం ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈ దశలో నిర్దిష్టమైన కాలపరిమితిని చెప్పలేమని ఆయన అన్నారు.

ఏ కొత్త రాష్ట్ర ఏర్పాటు అయినా విస్తృత ప్రబావాలు చూపుతాయని, దేశ ఫెడరల్ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. మాతృ రాష్ట్రం నుంచి విస్తృత ఏకాభిప్రాయం వస్తేనే అటువంటి విషయాలపై కేంద్రం ముందుకు కదులుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పలు అంశాలను, పద్ధతులను సమీక్షించడానికి వేసిన శ్రీకృష్ణ కమిటీ గత డిసెంబర్‌లో నివేదిక సమర్పించిందని ఆయన చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల విభజనకు తన 500 పేజీల నివేదికలో కమిటీ పలు ప్రత్యామ్నాయాలను సూచించిందని ఆయన చెప్పారు.