ఆర్టికల్.3 లోని నిజా నిజాలు

 

 

 

రాష్ట్ర విభజన అంటూ జరిగితే - 7వ షెడ్యూలులో 1వ రాష్ట్రంగా ఉన్న 'ఆంధ్రప్రదేశ్', ఆర్టికల్ 3(e) ప్రకారం 'తెలంగాణా రాష్ట్రం' గా పేరు మార్చుకొంటుంది. 29వ రాష్ట్రమొకటి కొత్తగా ఏర్పడుతుంది. అయితే, దానికి పేరు లేదు; రాజధాని లేదు; రాజ్యాంగ అస్తిత్వం లేదు! ఉన్నదల్లా రాజకీయ నాయకుల చేతుల్లో మోసగించబడిన దిక్కు తోచని ప్రజలు, గత 56 సంవత్సరాలుగా అనేక రకాలుగా వెనుకబడిన కొంత భూభాగము మాత్రమే! ఇట్లాంటి ఒక రాష్ట్రం తమకు ఏర్పాటు చెయ్యమని ఆ ప్రాంత ప్రజలు ఎన్నడూ కోరలేదు. అందుచేత దానికి ఏమి పేరు పెట్టాలనే ఆలోచనే లేదు! రాజధాని ఎక్కడ ఉండాలనే తీర్మానమే లేదు!

 


ఆ ప్రాంత ప్రజల కోరిక లేకుండా, అందుకు సంబంధించిన విజ్ఞాపన లేకుండా, వాళ్లకి ఇష్టం లేకుండా - కనీసం వాళ్ళతో చర్చించకుండా, కొత్త రాష్ట్రం మాకొద్దు, మమ్మల్ని విడదీయ వద్దు అని మొత్తుకుంటున్నా, కొనసాగుతున్న హైదరాబాద్ స్టేట్ ఉరఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బలవంతంగా తన్ని తరిమేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత నికృష్టంగా, ఇంత నిరంకుశంగా, ఒక రాష్ట్రం ఏర్పరిచిన సందర్భాలు ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్నాయా? నిపుణులే తేల్చి చెప్పాలి!