TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్

Published on: Fri May 20, 2022 6:11AM

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా చరిత్ర సృష్టించింది. ఫైనల్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ ను ఓడించి మహాళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో 52 కిలోల విభాగంలో విజేతగా నిలిచి బాక్సింగ్ లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

కాగా ఫైనల్ లో ఆరంభం నుంచీ ప్రత్యర్థిపై తిరుగులేని ఆథిపత్యం చలాయించిన నిఖిత్ 5-0 తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది,ప్రపపంచ చాంపియన్ షిప్ లో గెలిచిన ఐదో ఇండియన్ గాలినిచింది. నిఖిత్ ముందు మేరీ కోమ్, జెన్నీఅర్ఎల్, లేఖకేసీ, సరితాదేవి మాత్రమే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గెల్డ్ మెడల్ సాధించారు.  

నిజామాబాద్‌  జిల్లాలో  పుట్టిన నిఖత్‌ జరీన్ 13 ఏళ్ళ వయస్సులోనే బాక్సింగ్‌ రింగులోకి దింది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్‌ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది.

విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చార్య అవార్డు గ్రహీత ఐవీ రావు ఆధ్వర్యంలో శిక్షణ   తీసుకుంది.  ఏడాది తిరగకుండానే   2010 లో ఈరోడ్‌లో జరిగిన నేషనల్స్‌లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా’ పేరు సాధించింది నిఖత్‌ జరీన్‌. అక్కడ నుంచి జరీన్ వెనుదిరిగి చూడలేదు.  2011 లో అంటాల్యాలో జరిగిన   ఉమెన్స్ యూత్ & జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.  

2019 లో, బ్యాంకాక్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజత పతకం కైవసం   2014 లో సెర్బియాలోని నోవి సాడ్‌లో జరిగిన మూడవ నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించింది. 2015 లో అస్సాంలో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నారు.