కాంగ్రెస్ చీలిక ఓట్లపైన 'దేశం' భవిష్యత్?
Published on: Mon Apr 9, 2012 7:02AM
ఇటీవల ఉన ఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు తెలంగాణా ప్రాంతంలో వుంటే ఒకటి మాత్రం (కోవూరు) ఆంధ్రాప్రాంతంలో వుంది. ఈసారి జరగబోయే 18 స్థానాల ఉప ఎన్నికలు తెలంగాణ ప్రాంతంలో ఒకటి (పరకాల) మాత్రమే వుంటే మిగిలిన 17 స్థానాలు ఆంధ్రాప్రాంతంలో వున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలు తెలంగాణ ఉద్యమం, టి.ఆర్.ఎస్. రాజకీయ ప్రతిష్టతో ముడిపడి జరగగా ఈసారి జరగనోయే ఉప ఎన్నికలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ భవితవ్యం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఉప ఎన్నికలు జరగనున్న మొత్తం స్థానాలు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవే.
ఈ నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనోకూలంగా వ్యవహరించడం వల్ల పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారందరూ కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళడం అన్యాయం అని నిరూపించాలంటే లాంగ్రేస్ పార్టీ ఈ స్థానాలలో మళ్ళీ విజయం సాధించాల్సి వుంటుంది. అదే విధంగా తాము కాంగ్రెస్ ను వదిలి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడం సమంజసమే అని నిరూపించుకోవడం కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున పోటీచేసే వారంతా విజయం సాధించాల్సి వుంటుంది. ఇక తెలుగుదేశంపార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ చీలడం తమ పార్టీకి ఏ మేరకు లాభం కలుగు తుంది? లేదా జగన్ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు మాత్రమే ఎసరు పెడతాడా టం పార్టీ ఓట్లను కూడా చీల్చుతాడా అనే అంశం కూడా ఈ ఎన్నికలు నిర్ధారిస్తాయి. జగన్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుతాయని, పర్వావసానంగా తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చాలా ఆశతో వుంది. ఆ ఆశ నిజమోకాదో జరగనున్న ఉప ఎన్నికలు కొంతమేరకు నిర్ధారిస్తాయి.


