బ్రేకింగ్ : బీజేపీలోకి తీన్మార్ మల్లన్న..
Published on: Thu Sep 30, 2021 7:25PM
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని క్యూ న్యూస్ టీం అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేండ్ర మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టుల నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని మోడీ, అమిత్ షా ను మెయిల్ ద్వారా ఆయన భార్య మమత విన్నవించారు. మల్లన్న రిమాండ్ లో ఉన్న సమయంలో క్యూ న్యూస్ టీమ్ ఈ ప్రకటన చేయడం పలు చర్చలకు తావిస్తోంది.


