తీన్మార్ మల్లన్నకు బెయిల్.. కేసీఆర్ కు మరో షాక్
Published on: Mon Nov 8, 2021 11:08AM
(3).webp)
సీఎం కేసీఆర్ కు మరో షాకింగ్ న్యూస్.. తీన్మార్ మల్లన్నకు బెయిల్ వచ్చింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.దీంతో 74 రోజుల జైలు జీవితం తర్వాత రిలీజ్ కాబోతున్నారు. తీన్మార్ మల్లన్న పై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా.. 6 కేసులను కొట్టివేసింది హైకోర్టు. మిగతా 32 కేసులో 31 కేసులకు ఇప్పటికే బెయిల్ మంజూరు అయింది. పెండింగ్ లో ఉన్న ST SC కేసు లో తాజాగా హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది.
తీన్మార్ మల్లన్న వెంట ఉన్న అశోక్ పిర్యాదు పై st sc నమోదు చేశారు మేడిపల్లి పోలీసులు. ఈ st sc కేసులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బెదిరించి, ఆత్మహత్యాయత్నానికి పూనుకునేలా చేశాడంటూ లక్ష్మీకాంత్ శర్మ అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. తర్వాత అతనిపై మరిన్ని కేసులు నమోదయ్యాయి.


