TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీన్మార్ మల్లన్న అరెస్ట్

Published on: Tue May 10, 2022 3:05PM

క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లో లాండ్ పూలింగ్ కారణంగా నష్టపోయిన రైతులకు మద్దతు పలికేందుకు వెళుతున్న మల్లన్నను పోలీసులు జనగామ సమీపంలో అరెస్టు చేశారు.

అక్కడ నుంచి మల్లన్నను వరంగల్ తీసుకు వెళ్లారు. బీజేపీకి గుడ్ బై చెబుతున్నానని ఇటీవల మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇకపై కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లడనని కూడా మల్లన్న ఆ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో ఆయనకు ఇకపై పోలీసు కేసుల బాధలు ఉండవని అంతా భావించారు. 

అయితే అందుకు భిన్నంగా  వరంగల్‌లో లాండ్ పూలింగ్ రియల్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అక్కడి లైవ్ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం   వరంగల్‌కు వడుతుండగా.  జనగామ వద్ద  పోలీసులు ఆయనను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకునట్లు తెలుస్తోంది.