TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

Published on: Sun May 18, 2025 7:49AM

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ సీ61 సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదు. ఆదివారం ఉదయం 5.59 గంటలకు   రాకెట్‌ను ప్రయోగించిన  తర్వాత  మూడో ద‌శ అనంతరం  రాకెట్‌లో త‌లెత్తిన సాంకేతిక‌ స‌మ‌స్య తలెత్తినట్లు ఇస్రో చైర్మన్   నారాయణన్ వెల్ల‌డించారు.  నిర్ధిష్ట్ షెడ్యూల్ ప్రకారం  పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే..  మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో  ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్‌ను సమీక్షిస్తున్నారు.

  ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందనీ ఇస్రో చైర్మన్ తెలిపారు.   శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి...1696.24 కేజీల బరువు కలిగిన ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడానికి   శనివారం (మే 17) ఉదయం  7.59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటలు సాగిన అనంతరం ముందుగా నిర్ణయించిన మేరకు ఆదివారం ( మే 18) ఉదయం సరిగ్గా 5.59 గంటలకు రాకెట్ ను ప్రయోగించారు. అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం పూర్తి కాలేదు. పూర్తి వివరాలను తరువాత వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ తెలిపారు.